ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట
న్యూ హోప్ మినిస్ట్రీస్ సంస్థ వారి సేవలు అభినందనీయం –

టీడీపీ జాతీయ కోశాధికారి & నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)*

జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు న్యూ హోప్ మినిస్ట్రీస్ సంస్థ చిల్లకల్లు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి,దంత జనరల్ వైద్య శిబిరం అమెరికన్ డాక్టర్లచే శంకర నేత్రాలయం గుంటూరు,మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం వారి సహకారంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీరాం రాజగోపాల్(తాతయ్య)ప్రారంభించారు_

_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ హోప్ సంస్ధ వారు గత 20 సంవత్సరాలుగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని న్యూ హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన రెవరెండ్ పి.ప్రభుదాస్ మరెన్నో సేవలు నిర్వహించాలని అన్నారు.ఈ వైద్య శిబిరంలో అత్యధిక పరికరాలతో కంటి,దంత జనరల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అమెరికన్ డాక్టర్లకుకృతజ్ఞతలు తెలిపారు.ఈ అవకాశాన్ని అన్నవరం గ్రామ ప్రజలు,చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు._
కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు,వడ్డెంపుడి సీతారాములు, యలమందల కవి,గోళ్ళ సైదులు,తిక్కల రమేష్,రుంజ పాపారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.