చదువు,క్రీడలతోనే మంచి భవిష్యత్తు – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

*చదువు,క్రీడలతోనే మంచి భవిష్యత్తు – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణంలోని శుక్రవారం రాత్రి ఉక్కుకళా వేదిక నందు జరిగిన 66వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్,పవర్ లిఫ్టింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేసిశారు. *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను .*_

_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి 12 జిల్లాలు నుంచి వచ్చిన 500 మంది వెయిట్ లిఫ్టింగ్,పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఎక్కడ తీసిపోని విధంగా చక్కని ఏర్పాట్లు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ అయినా ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిల్లకల్లు వారిని అభినందించారు,ఇంత చక్కని ఆర్గనైజింగ్ చేసిన కమిటీ వారికి రాంకో సిమెంట్స్ వారితో మాట్లాడి 1,25,000 చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు._ క్రీడల్లో 17 సంవత్సరాల విభాగంలో కృష్ణా జిల్లా నుంచి బాలికలు మొదటి విజేతగా నిలిచారని,రెండో విజేతగా ప్రకాశం జిల్లా జట్టు అదేవిధంగా17 సంవత్సరాల బాలుర విభాగంలో చాంపియన్‌షిప్ విన్నర్ గుంటూరు జట్టు,రన్నర్స్ గా కృష్ణ జట్టు నిలిచారని,అండర్ 19 బాలికల విభాగంలో విజేతలుగా ప్రకాశం జట్టు,రన్నర్ గా కృష్ణ జట్టు నిలిచారని,అండర్ 19 బాలల విభాగంలో విన్నర్ గా కర్నూలు జట్టు,రన్నర్‌గా కృష్ణ జట్టు నిలిచారని అండర్ 17 స్ట్రాంగ్ మెన్ గా హేమవర్ధన్,అండర్17 స్ట్రాంగ్ ఉమెన్ జోష్ణ విశాఖపట్నం,అండర్ 19 స్ట్రాంగ్ మెన్‌గా షేక్ అబ్దుల్ మాటిల్ గుంటూరు,అండర్19 స్ట్రాంగ్ఉమెన్గా లక్ష్మిప్రకాశంజిల్లావారునిలిచారనిఅన్నారు.విజేతలుగా నిలవడం చాలా సంతోషంగా ఉందని,నేటి యువతరంలో చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని,చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు,క్రీడాకారులందరూ వివిధ క్రీడల్లో రాణించి మంచి విజయాలను సాధించాలని మన ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాన్ద్రప్రదేశ్ గా చెయ్యాలని,టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు_
అనంతరం ఎన్టీఆర్ జిల్లా స్కూల్స్ గేమ్ సెక్రెటరీ ఆర్ శ్రీధర్ రెడ్డి,టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గంటా వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేముల వెంకటేశ్వరరావు విజేతల వివరాలను తెలిపారు.
ఆర్గనైజేషన్ కమిటీ,అఫీషియల్స్,ఉపాధ్యాయులు తదితరులు అందరు కలిసి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభానుని ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ,మండలపార్టీ అధ్యక్షులు చిలుకూరు శ్రీనివాస్,నాయకులు ఫిరోజ్‌ఖాన్,పూసలపుల్లారావు,పిడిలుగురునాథం,సరోజ,నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసరావు,బాబురావు,సుధానంద్,ఎస్.వి సాగర్, రవికుమార్,లక్ష్మీ కుమారి,దినేష్ మహేష్,పాల్గొన్నారు._

Leave A Reply

Your email address will not be published.