75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? – ఖమ్మం సభలో కేసిఆర్

|| *అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్*||

*సీఎం కేసీఆర్:*

⚪️ ఖమ్మం

◻️ భారతదేశం తన లక్ష్యాలని కోల్పోయిందా? బిత్తరపోయిందా?

◻️ ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేనంత అన్నిరకాల సంపద ఉంది మన దగ్గర? మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం?

◻️ 41 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసిల జలరాశి, ఏటి పొడుగునా సూర్యరశ్మి, విశాల తీరప్రాంతం, మూడు విభిన్న వాతావరణ జోన్లు, యాపిల్ నుంచి మామిడి వరకు విభిన్న పంటలు, కష్టించి పనిచేసే జాతిరత్నాలలాంటి కోట్లాది మానవ సంపద… ఎందుకు మరి దరిద్రం?

◻️ ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా?

◻️ 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది?

◻️ ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్

◻️ ఈ దుర్మార్గానికి కారణభూతులు దొందూ దొందే – కాంగ్రెస్, బీజేపీ

◻️ మన గొంతులు, పొలాలు తడువాల్నా, ఎండాల్నా?

◻️ 14 లక్షల కోట్లు తమ మిత్రులైన పెట్టుబడిదారులకు దోచి పెట్టినరు. భారతదేశం అంతా 24 గంటలు కరెంటు ఇచ్చినా లక్ష కోట్లకు మించి ఖర్చు కాదు. దీనికి మాత్రం మనసు రాదు మోడీకి.

◻️ తెలంగాణ రైతుబంధు, 24 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్ఎస్ విధానం.

◻️ అయ్యా మోడీ గారూ. మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. మీరు ఎల్.ఐ.సి.ని అమ్ముతారు, మేము 2024లో అధికారంలోకి వస్తాం, ఎల్.ఐ.సి.ని జాతి పరం చేస్తాం. 42 లక్షల కోట్ల విలువైన ఎల్.ఐ.సి.ని నిలబెడుతాం. ఎల్.ఐ.సి ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులు అందరూ మాకు తోడు ఉండండి. కాపాడుకుందాం. విశాఖ ఉక్కును కూడా కాపాడుకుంటాం.

◻️ విద్యుత్ సంస్కరణల పేరుతొ ప్రైవేట్ చేయడం మేము ఆమోదించం. విద్యుత్ కార్మికులు అందరినీ కోరుతున్నాం, కలిసి పోరాడుదాం. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ సెక్టార్ లోనే అద్భుతంగా పనిచేసేలా చేద్దాం.

◻️ Govt has every business to do business. ప్రైవేట్ కు లాభసాటి వ్యాపారాలు అప్పగించే మీ ఆటలు సాగనివ్వం.

◻️.భారత దళిత జాతికి మేము అండగా ఉంటాం. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరుతాం.

◻️ మహిళల అభ్యుదయం, లింగ వివక్ష నిర్మూలన సాధిస్తాం. మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్లు ఇస్తాం.

◻️ చైనా, జపాన్, సింగపూర్, మలేషియా లను తలదన్నే రీతిలో భారతదేశం ప్రగతిబాట పట్టాలని బీఆర్ఎస్ సంకల్పం.

◻️ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అయిదు సవంత్సరాలలోపే దేశమంతా రక్షిత మంచినీరు ఇంటింటికీ ఇస్తాం.

◻️ మేక్ ఇన్ ఇండియా నిజమైన స్ఫూర్తిలో సాధిస్తాం.

◻️ యువతను పరిహాసం చేసే అగ్నివీర్ ను రద్దు చేస్తాం.

◻️ సర్వధర్మ సమభావన, సకల జనుల సంక్షేమం మా లక్ష్యం.
కుల-మత వివక్ష లేని భారతదేశం నిర్మిద్దాం. బీఆర్ఎస్ కు మద్దతు పలకండి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.