మంత్రి హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేసిన Dr అంజయ్య స్వామి

మంత్రి హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం సిద్దిపేట లో మంత్రి హరీష్ రావుకు రేణుకా ఎల్లమ్మ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు భక్తిరత్న అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు ఈసందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఈనెల 13న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వాన పత్రికను మంత్రి హరీష్ రావుకు అందజేయడం జరిగింది అని మంత్రి హరీష్ రావు రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవానికి తప్పకుండా హాజరు అవుతానని హామీ ఇచ్చారు అని అన్నారు ఈకార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, సిద్దిపేట సంతోషిమాత దేవాలయం అధ్యక్షులు మహంకాళి నవీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.